భారీ బడ్జెట్ తో హిరణ్య కశ్యప...

భారీ బడ్జెట్ తో హిరణ్య కశ్యప...

రానా - గుణశేఖర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'హిరణ్య కశ్యప'. ఈ సినిమాని టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ రానా తండ్రి అయిన సురేష్ బాబు నిర్మిస్తున్నారు. అయితే ఆయన ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు . ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తీస్తున్నట్లు తెలిపిన ఆయన అంత  బడ్జెట్ ఎందుకు అవుతుందో కూడా వివరించాడు. కొన్ని సినిమాలకు కథ ఆధారంగా భారీ బడ్జెట్ అవసరం అవుతుంది, వాటిని అలాగే తీయాలి. ఎందుకంటే... ఆ సినిమాల విషయంలో బడ్జెట్ దగ్గర రాజీపడితే హిట్ అందుకోలేము. హిరణ్య కశ్యప సినిమా కూడా అలాంటిదే.. అందుకే దీనిని భారీ బడ్జెట్ తో తీస్తున్నాము అని తెలిపాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకే 15కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఉన్న కరోనా కారణనంగా అలాగే రానాకు ఉన్న మిగిత సినిమాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.