విశాఖ గ్యాస్‌ లీక్‌.. నోటీసులు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిన సుప్రీంకోర్టు

విశాఖ గ్యాస్‌ లీక్‌.. నోటీసులు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిన సుప్రీంకోర్టు

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) రూ.50 కోట్ల రూపాయల అపరాధ రుసుం విధించడాన్ని సవాల్ చేసిన సుప్రీంకోర్టును ఆశ్రయిచింది ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం.. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఎన్జీటీలో వాదనలు వినిపించాలని ఎల్జీ పాలిమర్స్‌ను ఆదేశించింది.. ఇక, నోటీసులు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది.. జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు కొనసాగగా.. తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా పడింది. జూన్ 1వ తేదీన ట్రిబ్యునల్ జరిపే తదుపరి విచారణలో వాదనలు వినిపించుకొనేందుకు ఎల్జీ పాలిమర్స్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది సుప్రీంకోర్టు.. ఎన్జీటీ ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నందున.. జూన్ 1న తదుపరి విచారణ ఉన్నందున, ఈ లోగానే చట్టపరమైన పలు అంశాలపై అభిప్రాయాలను, అభ్యంతరాలను వివరించాలని ఎల్జీ పాలిమర్స్ ను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇది ఎన్జీటీ పరిధిలో లేని అంశమని ఎల్జీ పాలిమర్స్ తరుపున వాదనలు వినిపించారు ముకుల్ రోత్గి... అయితే, విషవాయువు లీకేజీ దుర్ఘటన ఖచ్చితంగా పర్యావరణ అంశమే అని వ్యాఖ్యానించింది ధర్మాసనం.. విషవాయువు లీకేజీ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు మొత్తం 7 కమిటీలను వేశారని, కేవలం ఒక్క కమిటీ విచారణ చాలన్నదే మా వాదన అని.. సుమోటోగా ఇలాంటి అంశాలపై ఎన్జీటీ ఆదేశాలు జారీచేయడం, విచారణ జరపడం చేయవచ్చా అన్నదే మా ప్రశ్న అని వాదించారు ముకుల్ రోత్గి.