ప్రభుత్వ ఆఫీసులకు రంగులు.. ఏపీ సర్కార్ పిటిషన్‌ కొట్టివేత..

ప్రభుత్వ ఆఫీసులకు రంగులు.. ఏపీ సర్కార్ పిటిషన్‌ కొట్టివేత..

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తర్వాత ప్రభుత్వం మారింది.. ఆ తర్వాత కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు.. ఇక, ప్రభుత్వం మారిన తర్వాత .. ఆయా ఆఫీసుల రంగుల మారాయి. దీనిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. రంగులను తొలగించాల్సిందేనని ఆదేశించింది. దీంతో.. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులపై ఏపీ ప్రభుత్వ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఏపీ సర్కార్ పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా.. హైకోర్టు ఆదేశాలను సమర్థించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. అధికారంలో ఉన్న పార్టీ జెండా రంగులను ప్రభుత్వ కార్యాలయాలకు వేసుకుంటూ పోతారా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అలా, దేశంలో ఉన్న కార్యాలయాలకు కాషాయ రంగు వేస్తే ఉరుకుంటారా? అని ఈ సందర్భంగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. రంగులు మార్చాలని హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.