రెండున్నర దశాబ్దాల తర్వాత మెగా ఫోన్ పట్టిన సూపర్ స్టార్

రెండున్నర దశాబ్దాల తర్వాత మెగా ఫోన్ పట్టిన సూపర్ స్టార్

నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.. కృష్ణ సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసారు. దాదాపు 350సినిమాల్లో ప్రధాన పాత్రలను పోషించారు కృష్ణ. ఇక టాలీవుడ్ లో ఒకే సంవత్సరంలో ఎక్కువ సినిమాలు చేసిన హీరోగా కృష్ణ రికార్డు పదిలంగా ఉంది.కృష్ణ నటుడిగానే కాకుండా  దర్శకుడిగా కూడా విజయాలను అందుకున్నారు. సింహాసనం, మహేష్ బాబు నటించిన బాల చంద్రుడు, కొడుకు దిద్దిన కాపురం,  -'ముగ్గురు కొడుకులు' వంటి సూపర్ హిట్ చిత్రాలకు కృష్ణ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కృష్ణ దర్శకుని అవతారమెత్తారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు - మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా అమరరాజా మీడియా అండ్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశానికి సూపర్ స్టార్ కృష్ణ డైరెక్షన్ చేసాడట.షూటింగ్ చూడటానికి వచ్చిన కృష్ణను ఒక సన్నివేశం కు దర్శకత్వం వహించమని దర్శకుడు కోరగా కృష్ణ డైరెక్షన్ చేశారట.  సూపర్ స్టార్ డైరెక్ట్ చేసిన ఆ సూపర్ సీన్ చూడాలంటే విడుదల అయ్యేదాకా ఆగాల్సిందే.