18న స‌న్నీ `వీర‌మాదేవి` ఫ‌స్ట్‌లుక్‌

18న స‌న్నీ `వీర‌మాదేవి` ఫ‌స్ట్‌లుక్‌

వీర‌మాదేవి వీర‌లెవ‌ల్లో ఫోజిచ్చింది! వీరాధివీరుల‌కే మ‌తిచెడే దివ్య‌రూప‌మిది. ఈ శుక్ర‌వారం (18మే) `వీర‌మాదేవి` ఫ‌స్ట్‌లుక్‌ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్న వేళ స‌న్నీ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. చెన్న‌య్ వేదిక‌గా సాగే ఈ వేడుక‌కు స‌న్నీలియోన్ ఎటెండ్ కానుంద‌ని తెలుస్తోంది. ఈలోగానే స‌న్నీ ఇన్‌స్టాగ్ర‌మ్ కొత్త కొత్త ఫోటోషూట్ల‌తో వేడెక్కిస్తోంది. 

ఇటీవ‌లే ఈ భామ ఓ ప్ర‌ఖ్యాత బ్రాండ్ లోదుస్తుల కంపెనీకి ప్ర‌చార‌క‌ర్త‌గా సంత‌కం చేసింది. ఇందుకు భారీ మొత్తాన్నే స‌న్నీ ఖాతాలో వేసుకుంటోంద‌ని స‌మాచారం. ఇదిగో లూజ్ చొక్కాయ్‌.. టైట్‌ఫిట్ లోదుస్తు(లింగ‌రీ)ల్లో ఇలా ద‌ర్శ‌న‌మిచ్చింది. `ఏక్ పెహ‌లీ లీలా` మ‌రీ ఇంత ఘాటుగా ఫోజిచ్చిందే అంటూ కుర్ర‌కారులో ఒక‌టే డిస్క‌ష‌న్‌. ద‌క్షిణాఫ్రికా కేప్‌టౌన్‌లో భ‌ర్త డేనియ‌ల్‌తో క‌లిసి పుట్టిన‌రోజు వేడుక‌లు పూర్తి చేసుకున్న స‌న్నీ ఇటీవ‌లే ముంబైకి తిరిగి వ‌చ్చింది. ఇక‌పై వీరమాదేవి ప్ర‌మోష‌న్స్ స‌హా, ఇత‌ర‌త్రా సినిమాల సంగ‌తి చూడ‌నుందిట‌.