సన్నీ లుక్ అదుర్స్

సన్నీ లుక్ అదుర్స్

శృంగార‌తార స‌న్నీలియోన్ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త లుక్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానుల్ని ప‌రేషాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు `క‌ర‌ణ్‌జీత్ కౌర్` (స్వీయ క‌థ‌) బ‌యోపిక్‌లో న‌టిస్తూనే.. మ‌రోవైపు స్టార్ స్ట‌క్ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల ప్ర‌చారం సాగిస్తోంది. ఆన్‌లైన్‌, సామాజిక మాధ్య‌మాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు మేక‌ప్ క్లాసులు చెబుతూ స‌న్నీ అభిమానుల‌కు చేరువ‌గా ఉంటోంది. 

తాజాగా ట్విట్ట‌ర్‌లో స్టార్ స్ట‌క్ ప్ర‌చారంలో భాగంగా క‌ల‌ర్ కాంబినేష‌న్ గురించి క్లాస్‌నిస్తూ ఓ ఫోటోని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో నీలిరంగు టైట్‌ఫిట్ డ్రెస్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. బాట‌మ్‌లో టైట్ జీన్స్‌.. టాప్  డెనిమ్ బ్లూ బ‌నియ‌న్‌.. కాంబినేష‌న్ లిప్‌స్టిక్‌తో ఆక‌ట్టుకుంటోంది. ఏదైనా డ్రెస్ వేసుకుంటే, దానికి కాంబినేష‌న్ మేక‌ప్ ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది సన్నీ. `స్టార్రీ నైట్‌` వేళ  .. స్టార్ స్ట‌క్ క‌ల‌ర్స్ .. ఎలా ఉన్నాయ్‌?.. అంటూ ప్ర‌శ్నించింది స‌న్నీ. మొత్తానికి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా న‌డిపించే అన్నిర‌కాల ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌ని స‌న్నీ చేస్తోంది. బిలియ‌న్ డాల‌ర్ కంపెనీగా మార్చాల‌న్న పంతం త‌న‌లో క‌నిపిస్తోంది.