కరోనాను ఓడించడానికి గవాస్కర్ విరాళం...

కరోనాను ఓడించడానికి గవాస్కర్ విరాళం...

ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వైరస్ ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం అని రకాలుగా ప్రయత్నిస్తుంది. అయితే కరోనా బాధితుల కోసం ఆర్థిక సహాయం చేయడానికి భారత క్రికెటర్లు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి భారత మాజీ క్రికెటర్ లెజండరీ బ్యాట్స్మాన్ సునీల్ గవాస్కర్ చేరిపోయారు. ఆయన కరోనా రిలీఫ్ ఫండ్ కోసం రూ .59 లక్షలు విరాళంగా ఇచ్చాడు. సునీల్ గవాస్కర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించకపోగా, ముంబై మాజీ బ్యాట్స్మాన్ 'అమోల్ మజుందార్" సోషల్ మీడియాలో  తెలిపారు. గవాస్కర్ పిఎం-కేర్స్ నిధికి రూ .35 లక్షలు, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిధికి రూ .24 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు మజుందార్ తెలిపారు. అయితే గావాస్కర్ గత వారం ఏ విరాళం అందజేశారట... కానీ ఆ విషయాన్ని ఆయన బయట పెట్టలేదు.