కరెంట్ బిల్లులు చూస్తుంటే కొత్త సినిమా వీకెండ్ కలెక్షన్స్ లా అనిపిస్తోంది...

కరెంట్ బిల్లులు చూస్తుంటే కొత్త సినిమా వీకెండ్ కలెక్షన్స్ లా అనిపిస్తోంది...

దేశ వ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ తరవాత.. కరెంట్ బిల్లులు తేరుకోలేని షాకిస్తున్నాయి. ఈ బిల్లులను చూసిన విద్యుత్ వినయోగదారులు బంబేలెత్తిపోతున్నారు. రెండు మూడు వేలు వచ్చే కరెంట్ బిల్లులు ఇపుడు ఏకంగా పది నుంచి 20 రెట్లు అదనంగా వస్తున్నాయి. సామన్యులు నుంచి సెలబ్రెటీలు వరకు కరెంట్ బిల్లులు చూసి షాక్ అవుతున్నారు.తాజాగా కరెంట్ బిల్లులపై యంగ్ హీరో సందీప్ కిషన్ స్పందిస్తూ .. కరెంట్ బిల్లులు సినిమా కలెక్షన్స్ లా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు . ‘ఇంట్లోని కరెంట్ మీటర్ చూస్తుంటే చిన్నప్పటి ఆటో రిక్షా గుర్తొస్తుందని.. ఇంత కరెంట్ బిల్లులు ఏంటని.? కరెంట్ బిల్లుల పోటీ వార్ ఆన్ లైన్లో ప్రారంభిస్తారు కావచ్చు..ఈ బిల్లులు చూస్తుంటే కొత్త సినిమాల వీకెండ్ కలెక్షన్ రిపోర్టుల్లా అనిపిస్తోంది’ అని సందీప్ ట్వీట్ చేసారు .