హైదరాబాద్ లక్ష్యం 164

హైదరాబాద్ లక్ష్యం 164

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ముందు ఢిల్లీ 164 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన డేర్ డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. డెవిల్స్ బ్యాట్స్‌మెన్లలో పృథ్వీషా కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు.. కేవలం 36 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సులతో 65 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిద్ధార్థ్ కౌల్ 1 వికెట్ పడగొట్టారు.