మహేష్ కోసం రెడీ అవుతున్న సుకుమార్..!

మహేష్ కోసం రెడీ అవుతున్న సుకుమార్..!
భరత్ అనే నేను ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు వంశి పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు వేగవంతమయ్యాయి.  ప్యారిస్ ట్రిప్ లో ఉన్న మహేష్ వచ్చిన వెంటనే వంశి సినిమాలో నటిస్తాడు.  వైజయంతి మూవీస్, దిల్ రాజు సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోనే జరుపుకుంటుంది.  ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ కోసం చాలా ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి.  వంశి తరువాత మహేష్, రంగస్థలంతో హిట్ అందుకున్న దర్శకుడు సుకుమార్ తో సినిమా చేయబోతున్నాడు.  
సుకుమార్ కథ, కథనాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు.  ఒకవైపు స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసుకుంటూనే.. మరోవైపు సాంకేతిక వర్గాన్ని, నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో మునిగిపోయాడు.  సుకుమార్ ఎప్పటిలాగే తన సినిమాకు దేవిశ్రీని సంగీత దర్శకుడిగా ఇప్పటికే ఎంపిక చేసుకున్నారట.  శ్రీమంతుడు, రంగస్థలం వంటి భారీ హిట్స్ ను నిర్మించిన మైత్రి మూవీమేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.