25 మంది ఎంపీలను ఇవ్వండి.. చూపిస్తాం

25 మంది ఎంపీలను ఇవ్వండి.. చూపిస్తాం

విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో మనకు పనికావడం లేదని చెప్పినా.. రాష్ట్రం కోసం ఓపిక పట్టాలని చంద్రబాబు చెప్పేవారని.. ఆయన ఓపికకు జోహార్లని అన్నారు. పార్లమెంట్ చట్టం చేస్తే కేంద్రం అమలు చేయాలి. అదీ చేయలేదు.. చివరకు 2016 సెప్టెంబర్‌లో స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వలేదని.. చట్టంలోని లోపాలను సవరించే అవకాశమున్నా ఆ పని చేయలేదని చౌదరి దుయ్యబట్టారు. పేపర్ మీద చెప్పినవి ఏవి క్షేత్రస్థాయిలో జరగలేదని.. టీడీపీ పోరాటంతోనే కొంతమేర అయినా సాధించుకోగలిగామని ఆయన అన్నారు. ఏమీ జరగకపోయినా.. 80శాతం హామీలు నెరవేర్చామని బీజేపీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే దేశానికి మంచిదని.. 2019లో అన్యాయాన్ని గుర్తించి ఓటేయ్యాలని.. 25 మంది ఎంపీలను గెలిపిస్తే.. జాతీయస్థాయిలో సత్తా చాటుతామని సుజనా చౌదరి ఓటర్లను కోరారు.