ఇండోనేషియాలో ఆత్మాహుతి దాడి...

ఇండోనేషియాలో ఆత్మాహుతి దాడి...

ఇండోనేషియా సురబయలోని పోలీసు ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. వివరాల ప్రకారం... సురబయలోని పోలీసు ప్రధాన కార్యాలయంకు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. పోలీసు కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ఆ ఇద్దరు ప్రయత్నించారు. అక్కడ ఉన్న భద్రతా అధికారులు వారిని అడ్డుకోగా.. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఆత్మాహుతి దాడిలో ఏడుగురు మృతి చెందారు.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ  ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అయితే ఈ ఆత్మాహుతి దాడిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. ఆదివారం మూడు చర్చిల్లో ఒకే ఫ్యామిలీకి చెందిన ఉగ్రవాదులు చేసిన దాడుల్లో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.