మహేష్ తో ఎప్పటికైనా సినిమా చేస్తా 

మహేష్ తో ఎప్పటికైనా సినిమా చేస్తా 

తెలుగు యువహీరో సుధీర్ బాబు తాజాగా నటించిన చిత్రం సమ్మోహనం. ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ మహేష్ బాబుతో ఒక్కసినిమా అయినా నిర్మాతగా చేయాలని, అది కూడా సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లో చేయాలనీ అదే తన డ్రీం అని తెలిపారు. సుధీర్ బాబు..సమ్మోహనం చిత్రానికి దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటితో పనిచేసిన సంగతి తెలిసిందే. ఇతని టాలెంట్ కు ఫిదా అని సుధీర్..మోహన్ కృష్ణ దర్శకుడుగా, మహేష్ బాబు హీరోగా ఓ సినిమా చేయాలనుందని తన మనసులో మాట బయటపెట్టారు. 

మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు స్టోరీని అందంగా చెప్పడంలో మాస్టర్..ఈ తరం నటులంతా ఒక్కసారైనా ఇతనితో పనిచేయాలి. ఇతను మహేష్ బాబుతో సినిమా చేస్తే అది తప్పకుండా అద్భుతమైన సినిమా అవుతుంది అని తెలిపారు. మరి మహేష్ బాబు దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇక సమ్మోహం గురించి మాట్లాడుకుంటే..అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించగా, ఒక సినిమా స్టార్ కి, మాములు ప్రేక్షకుడికి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందో తెలిపేలా ఈ సినిమా ఉండనుంది. జూన్ 15 నుండి థియేటర్లలో సందడి చేయనుంది.