ఏపీలో ఎంఎస్‌ఎంఈలకు గుడ్ న్యూస్.!

ఏపీలో ఎంఎస్‌ఎంఈలకు గుడ్ న్యూస్.!

కోవిడ్‌ 19 కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న ఎంఎస్‌ఎంఈలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రీస్టార్ట్‌  ప్యాకేజీలో భాగంగా  సూక్ష్మ ,మధ్యతరహా పరిశ్రమలకు రెండో విడత బకాయిలను రాష్ట్రప్రభుత్వం ఈరోజు చెల్లించనుంది. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిధులను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్దిదారులతో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత ప్రభుత్వం చెల్లించని బకాయిలును కూడా నేరుగా ఎంఎస్‌ఎంఈల ఖాతాల్లో జమ చేయనున్నారు. రీస్టార్ట్‌ కార్యక్రమంలో భాగంగా  7717 పరిశ్రమలకు అందాల్సిన బకాయిల్లో ఇప్పటికే తొలి విడత బకాయిలు  విడుదలచేశారు. కాగా రెండోవిడత బకాయిలను ఈరోజు విడుదల చేయనున్నారు. రీస్టార్ట్‌  ప్యాకేజీలో భాగంగా రెండో విడత చెల్లింపుల కింద ఈరోజు 128 పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు 163 క్లెయిమ్స్‌కు సంబంధించిన రూ. 58.97 కోట్లు విడుదల చేయనున్నారు.