పీవీకి భారతరత్న...! బీజేపీ ఎంపీ డిమాండ్

పీవీకి భారతరత్న...! బీజేపీ ఎంపీ డిమాండ్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ డిమాండ్‌ వినిపించారు.. తాజాగా, భారతీయ జనతా  పార్టీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ పొలిటీషన్ సుబ్రమణ్యస్వామి కూడా ఇదే డిమాండ్ చేశారు...  హైదరాబాద్‌లో ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో ఇండియా ఆన్ ఎకనామిక్ సూపర్ పవర్ 2030 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికీ స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల దేశాభివృద్ధి ఆగిపోయిందన్నారు.. అయితే, రీపామ్స్‌కు పీవీ నరసింహారావు ఆద్యుడుగా అభివర్ణించిన స్వామి.. పీవీ నరసింహారావు హయాంలోనే ఒక్క శాతం ఉన్న జీడీపీ 8 శాతానికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన.. పీవీకి భారతరత్న కోసం పోరాటం చేస్తానని ప్రకటించారు. ప్రభుత్వాలు అసలు పీవీకి ఎందుకు భారతరత్న ఇవ్వలేదో అర్థం కావడం లేదని ఆశ్చర్యాన్ని వ్యక్తిం చేశారు సుబ్రమణ్యస్వామి.