ధోని కి వ్యతిరేకంగా దేవుడు కూడా మీకు సహాయం చేయలేడు...

ధోని కి వ్యతిరేకంగా దేవుడు కూడా మీకు సహాయం చేయలేడు...

మాజీ భారత, సిఎస్కే బాట్స్మెన్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఎంఎస్ ధోని కెప్టెన్సీ గురించి కొన్ని విషయాలు బయటపెట్టాడు. బద్రీనాథ్ 6 ఐపీఎల్ సీజన్లలో ఎంఎస్ ధోని నాయకత్వంలో ఆడాడు. ఎంఎస్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు, ఎందుకంటే అతను కెప్టెన్‌గా మూడు ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకున్నాడు మరియు ఇప్పటివరకు జరిగిన 12 ఫైనల్స్‌లో తొమ్మిదింటిలో ఆడాడు. అలాగే టోర్నమెంట్ మొత్తంలో గెలిచిన మ్యాచ్‌ల సంఖ్యను బట్టి ఐపీఎల్ ‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోని. ఇక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనికి ఉన్న అతి పెద్ద బలం ఏమిటంటే, ఆటగాడికి ఎక్కువ  అవకాశాలు ఇవ్వడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని బద్రీనాథ్ వెల్లడించారు. అతను ఆటగాడికి తన ఆటను నిరూపించుకోవడానికి అవకాశాలు ఇస్తాడు. అలాగే ఒకవేళ మీరు దీనికి సరిపోరు అని అతను అనుకుంటే , దేవుడు కూడా మీకు సహాయం చేయలేడు. అతను తన సొంత నిర్ణయాన్ని కలిగి ఉంటాడు మరియు దానితో మరెవరికి సంబంధం ఉండదు. ధోని ఒక్క నిర్ణయానికి వస్తే అంతే దానిని ఎవరు మార్చలేరు అని బద్రీనాథ్ అన్నాడు.