10500 ఎగువన ముగిసిన నిఫ్టి

10500 ఎగువన ముగిసిన నిఫ్టి

మార్కెట్‌ మళ్ళీ పుంజుకుంది. నిన్న భారీగా నష్టపోయిన యూరో మార్కెట్లు ఇవాళ లాభాల్లోకి రావడం, డాలర్‌ బలంతో ఐటీ షేర్లకు డిమాండ్‌ పెరగడంతో సూచీలు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 83 పాయింట్లు లాభపడి 10513 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కూడా 318 పాయింట్ల లాభంతో 34,663 వద్ద ముగిసింది. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో ఎన్‌సీసీ షేర్ పది శాతం పెరిగింది.

డాలర్‌బలంతో ఐటీ షేర్లకు డిమాండ్‌ కన్పిస్తోంది. నిఫ్టి ప్రధాన షేర్లలో  భారతీ ఎయిర్‌ టెల్‌ 4 శాతంపైగా లాభపడగా... టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లు మూడు శాతం వరకు పెరిగాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా 3 శాతం పెరగ్గా, సన్‌ ఫార్మా రెండున్నర శాతం లాభంతో ముగిసింది. నష్టపోయిన నిఫ్టి షేర్లలో టాటా మోటార్స్‌ ముందుంది. ఈ షేర్‌ ఆరు శాతంపైగా నష్టపోయింది. గెయిల్‌ 5శాతం, ఓఎన్‌జీసీ నాలుగు శాతం,  గ్రాసిమ్‌ రెండున్నర శాతం నష్టపోగా... హెచ్‌పీసీఎల్‌ ఒక శాతంపైగా పడింది. ఇక బీఎస్‌ఇలో ఎరోస్‌ మీడియా రికార్డు స్థాయిలో 19 శాతం పెరగ్గా, ఎన్‌సీసీ పది శాతందాకా పెరిగి క్లోజింగ్‌ 9 శాతం లాభం పొందింది. కావేరీ సీడ్స్‌ ఏడున్నర శాతం, ఆస్ట్రాల్‌ 7 శాతం పెరగ్గా జస్ట్‌ డయల్‌ షేర్‌ కూడా 6.6 శాతం లాభపడింది. నష్టపోయిన షేర్లలో గ్రాన్యూయల్స్ ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉన్నాయి.