ఐపీఎల్ భారత్ లోనే బాగుంటుంది : స్మిత్

ఐపీఎల్ భారత్ లోనే బాగుంటుంది : స్మిత్

కరోనా కష్టకాలం లో కూడా ఐపీఎల్ లో పాల్గొనేందుకు తమ ఆటగాళ్లకు ఎన్ఓసి ఇచ్చిన మొదటి క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియా. ఇక ఐపీఎల్ లో ఆడే ఆసీస్ ఆటగాళ్లలో ముందు వరసలో ఉండేది డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్. అయితే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన స్మిత్ ఈ మధ్య తమ ఫ్రాంఛైజ్ తో  సోషల్ మీడియాలో మాట్లాడాడు. అందులో '' ఐపీఎల్ వంటి మెగాటోర్నీని భారత్ లో ఆడటం మాకెంతో ఇష్టం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా అది యూఏఈ లో ఆడాల్సి వస్తుంది. అయితే ఇంతక ముందు 2014 లో ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లు అక్కడే ఆడాము. అలాగే మా ఆటగాళ్లలో కొంతమందికి యూఏఈ లో ఆడిన అనుభవం ఉంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ జరగడం మంచిదే కానీ అది భారత్ లోనే జరిగితే బాగుండేది'' అని అన్నాడు