ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాష్ట్ర చిహ్నాలు..

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాష్ట్ర చిహ్నాలు..

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాష్ట్ర చిహ్నాలు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక చిహ్నాలు లేకపోవడంతో కొత్త చిహ్నాల కోసం చాలా వాటిని పరిశీలించింది. వీటిలోంచి కొన్నింటిని రాష్ట్ర చిహ్నాలుగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము జీవోను జారీ చేశారు. జూన్ ఆరు నుంచి కొత్త చిహ్నాలు అమల్లోకి వస్తాయని జీవోలో పేర్కొన్నారు

కొత్త రాష్ట్ర చిహ్నాలు:
* రాష్ట్ర పక్షి- రామచిలుక


* రాష్ట్ర చెట్టు- వేపచెట్టు


* రాష్ట్ర జంతువు- కృష్ణ జింక


* రాష్ట్ర పుష్పం- మల్లెపువ్వు