ప్రపంచ కప్ ఫిక్సింగ్... 6 గంటల పాటు డిసిల్వా ఇంటరాగేషన్

ప్రపంచ కప్ ఫిక్సింగ్... 6 గంటల పాటు డిసిల్వా ఇంటరాగేషన్

2011 ప్రపంచ కప్ ను శ్రీలంక భారత్  కు అమ్ముకుంది అని శ్రీలంక మాజీ క్రీడా మంత్రి మహిందనంద అలుత్గమగే ఈ నెల ప్రారంభంలో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ప్రపంచ కప్ పై దర్యాప్తు ప్రారంభించింది. అందులో భాగంగా 2011 శ్రీలంక చీఫ్ క్రికెట్ సెలెక్టర్ అయిన అరవింద డి సిల్వాను మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల పై కొత్తగా ఏర్పాటు చేసిన క్రీడల అవినీతి నిరోధక విభాగం 6 గంటల పాటు ఇంటరాగేషన్ చేసినట్లు దాని సూపరింటెండెంట్ జగత్ ఫోన్‌సేకా తెలిపారు. "ఈ రోజు మేము (2011 ప్రపంచ కప్) మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించాము. ఈ రోజు అరవింద డి సిల్వా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, ఒక ఆటగాడిని ''ఉపుల్ తరంగ''ను రేపు పిలిపించాలని నిర్ణయించుకున్నాము అని ఫోన్‌సేకా తన యూనిట్ కార్యాలయం వెలుపల విలేకరులతో తెలిపారు. అయితే  తరంగ శ్రీలంక ఓపెనర్. 2011 ఫైనల్ మ్యాచ్ లో క్రీజులో 30 నిమిషాల పాటు ఉన్న తరంగ 20 బంతులు ఆడి కేవలం రెండు పరుగులు మాత్రమే చేసాడు. ఇక ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.