2011 ప్రపంచ కప్ పై క్రిమినల్ దర్యాప్తు...

2011 ప్రపంచ కప్ పై క్రిమినల్ దర్యాప్తు...

2011 ప్రపంచ కప్ ఫైనల్‌ను భారత్‌కు విక్రయించినట్లు వస్తున్న ఆరోపణలపై క్రిమినల్ దర్యాప్తుకు శ్రీలంక ప్రభుత్వం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. నేర పరిశోధన ప్రారంభమైంది అని ప్రస్తుత క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి రువాన్‌చంద్ర చెప్పారు. క్రీడలకు సంబంధించిన నేరాలపై ప్రత్యేక దర్యాప్తు విభాగం విచారణ నిర్వహిస్తుంది. అయితే 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ను శ్రీలంక భారత్ కు విక్రయించిందని మాజీ క్రీడా మంత్రి మహిందనంద అలుత్గమగే ఈ నెల ప్రారంభంలో ఆరోపించారు. అలాగే 1996 శ్రీలంక ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అర్జున రణతుంగ కూడా 2011 ప్రపంచ కప్ పై సందేహాన్ని వ్యక్తం చేశాడు మరియు గతంలో దర్యాప్తుకు పిలుపునిచ్చాడు. ఇక 2011 ప్రపంచ కప్ చీఫ్ సెలెక్టర్ అరవింద డి సిల్వాను ఈ రోజు ఇన్వెస్టిగేషన్ కోసం అధికారులు పిలిచినట్లు అక్కడి స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.