స్వీయ గృహ నిర్బంధం లోకి కుమార్ సంగక్కర... ఎందుకంటే..?

స్వీయ గృహ నిర్బంధం లోకి కుమార్ సంగక్కర... ఎందుకంటే..?

శ్రీలంక దిగ్గజ  బ్యాట్స్మెన్ కుమార్ సంగక్కర ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. అయితే ప్రపంచాన్ని మొత్తం కరోనా వణికిస్తున్న కారణంగా ప్రజలు అత్యవసర అత్యవసర పరిస్థితుల్లో మినహాయించి ప్రజలు ఎవరు బయటికి రాకూడదని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే సంగక్కర మరియు అతని మహేలా జయవర్ధనే ఇద్దరూ సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నారు. అయితే శుక్రవారం సాయంత్రం దేశం కర్ఫ్యూలోకి వెళ్ళినందున ప్రజలు ఎవరు భయాందోళనలకు గురికావద్దని మరియు సరైన సామాజిక దూరాన్ని పాటించాలని శ్రీలంక ప్రజలను కోరారు. అయితే అందులో సంగక్కర మాట్లాడుతూ... నేను ఒక వారం క్రితం లండన్ నుండి వచ్చాను అయితే మార్చి 1 నుండి 15 వరకు విదేశాల నుండి వచ్చిన వారు ఎవరైనా తమను తాము స్వీయ  గృహ నిర్బంధం చేసుకోవాలని ప్రభుత్వం  ఆదేశించిందని అందుకే తాను  స్వీయ  గృహ నిర్బంధం లో ఉన్నట్టు వెల్లడించాడు. అయితే నాకు లక్షణాలు అలాంటిదేమీ లేవు, కాని నేను ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తున్నాను" అని తెలియజేసాడు. అయితే శ్రీలంక లో ఇప్పటివరకు 80 కి పైగా కరోనా పాజిటివ్ కేసులను నమోదయ్యాయి.