సన్‌రైజర్స్ @ 172

సన్‌రైజర్స్ @ 172

ఐపీఎల్‌లో భాగంగా ఉప్పల్‌ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. తక్కువ స్కోర్ చేసి బౌలింగ్‌తో ఆకట్టుకుని విజయాన్ని అందుకునే హైదరాబాద్... ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 50 పరుగులతో ఆకట్టుకోగా... కేన్ విలియమ్సన్ 36, శ్రీవాత్స్ గోస్వామి 35 పరుగులతో రాణించడంతో 172 పరుగులు చేసి కోల్‌కతా ముందు 173 పరుగుల టార్గెట్ పెట్టింది. ఇక కోల్‌కతా బౌలర్లు ప్రశిద్ధ్ నాలుగు వికెట్లు తీయగా... రస్సెల్, నరైన్, కుల్దీప్, సీర్‌లెస్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌కు పెద్ద ఎత్తున సెలబ్రిటీలతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ తరలివచ్చి... ఉప్పల్ స్టేడియంలో హంగామా చేశారు.