బెంగళూరు టార్గెట్ 147...

బెంగళూరు టార్గెట్ 147...

ఐపీఎల్-11లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. బెంగళూరు  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. సన్‌రైజర్స్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. హైదరాబాద్‌కు ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేదు. అలెక్స్‌ హేల్స్‌ (5), శిఖర్‌ ధావన్‌(13) త్వరగానే పెవిలియన్ బాట పట్టారు. మనీశ్ పాండే(5) కూడా వీరిని అనుసరించాడు. ఈ క్రమంలో కెప్టెన్ విలియమ్సన్‌(56)ఒంటరి పోరాటం చేశాడు. షకిబ్‌(35)తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. కొద్ది వ్యవదిలో ఈ జోడి పెవిలియన్ చేరారు. చివర్లో యూసఫ్‌ పఠాన్‌ (12) కూడా నిరాశపరిశాడు. బౌలర్లు రషీద్‌ ఖాన్(1), సిద్ధార్థ్‌ కౌల్(1), సందీప్‌ (0)లు ఔట్‌ కావడంతో హైదరాబాద్‌ 146లు మాత్రమే చేసింది. బెంగళూరు బౌలర్లు సిరాజ్‌ మూడు, సౌథీ రెండు వికెట్లు తీశారు. బెంగళూరుకు సన్‌రైజర్స్‌ 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.