ఫైనల్‌కు దూసుకెళ్లిన హైదరాబాద్‌

ఫైనల్‌కు దూసుకెళ్లిన హైదరాబాద్‌

ఐపీఎల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిం ఆరెంజ్ ఆర్మీ... సొంతగడ్డపై కోల్‌కతా టీమ్‌ను మట్టికరిపించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్. నైట్ రైడర్స్‌కు స్పిన్ పంచి ఇచ్చిన హైదరాబాద్‌... గ్రాండ్‌గా ఫైనల్ ఎంట్రీ ఇచ్చింది. ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టాడు రషీద్ ఖాన్... ఇక చెన్నై సూపర్ కింగ్స్‌తో ప్రతీకార మ్యాచ్‌కు రెడీ అయ్యింది. ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో దెబ్బతిన్న ఆరెంజ్ ఆర్మీ... ఐపీఎల్‌ క్వాలిఫయర్ 2 పోరులో గురుతప్పకుండా విక్టరీ కొట్టింది. సొంతగడ్డపై తమకు ఎదురులేదనుకున్న కోల్‌కతాకు షాకిచ్చింది. మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసిన హైదరాబాద్‌,... కోల్‌కతా ముందు 175 పరుగుల టార్గెట్ పెట్టింది. అయితే లక్ష్యఛేదనలో కోల్‌కతా తడబడింది... 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతాపై 13 పరుగులు తేడాతో విజయం సాధించిన హైదరాబాద్‌... ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఇక ఈ నెల 27వ తేదీన చెన్నైతో ఫైనల్‌లో ఫైట్ చేయనుంది హైదరాబాద్ టీమ్.