కేసీఆర్ క్రీడా రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు : మంత్రి 

కేసీఆర్ క్రీడా రంగంపై ప్రత్యేక దృష్టి సారించారు : మంత్రి 

సీఎం కేసీఆర్ క్రీడా రంగంపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అందులో భాగంగానే వేసిన సబ్ కమిటీ కోసం 911 జీవోను విడుదల చేసారని, యువత ను మంచి మార్గంలో పెట్టేందుకు స్పోర్ట్స్ ఉపయోగ పడుతుందని అయన అన్నారు. గత ప్రభుత్వాల కాలంలో క్రీడారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ఒలింపిక్స్ మెడల్ గెలిచిన క్రీడాకారులకు భారీగా ప్రోత్సాహకాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. " 97 నియోజక వర్గాల్లో ఇప్పటికే 34 స్టేడియాలు నిర్మించాం.. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. వరంగల్ లోను అత్యాధునిక సింథటిక్ ట్రాక్ ను ప్రారంభించబోతున్నాం. క్రీడాభివృద్ది కోసం వేసిన కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. ఉన్న సదుపాయాల తోనే ఎందరో గొప్ప క్రీడాకారులు వెలుగులోకి వచ్చిన రాష్ట్రం మనది
త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుంది. గతంలో శామిర్ పెట్ లో గోల్ఫ్ కోర్ట్ పేరిట 150 ఎకరాల స్థలాన్ని అన్యాక్రాంతం చేసారు.. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ఉపయోగం చేసుకుంటాం. మంత్రి కేటీఆర్  సైతం స్పోర్ట్స్ కు పెద్ద పీట వేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. రాబోయే స్పోర్ట్స్ పాలసీ లో క్రీడలతో సంభందం ఉన్న అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. హైదరాబాద్ లో మేజర్ టోర్నీ నిర్వహించేందుకు సబ్ కమిటీ లో చర్చిస్తాం.." అని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.