బిల్డింగ్‌ ఎక్కాడు.. పౌరసత్వం పట్టాడు..

బిల్డింగ్‌ ఎక్కాడు.. పౌరసత్వం పట్టాడు..

పారిస్‌లో స్పైడర్‌ మ్యాన్‌లా నాలుగు అంతస్తులు పాక్కుంటూ భవంతిపైకెక్కి నాలుగేళ్ల పిల్లవాడిని కాపాడిన మమౌడు గస్సమా(22) రాత్రికి రాత్రే ఫ్రాన్స్‌ హీరోగా మారిపోయాడు. గస్సమాను ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మన్యూయేల్‌ మార్కన్‌ సత్కరించి, సాహస సతకాన్ని బహూకరించారు. ఫ్రాన్స్‌ పౌరసత్వాన్ని ప్రకటించారు. ఫ్రెంచ్‌ అగ్నిమాపకదళంలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. మాలి దేశానికి చెందిన  గస్సమా జీవనోపాధి కోసం పారిస్‌ వచ్చాడు. వలసదారుల వసతి గృహంలో ఉంటున్నాడు. భవంతి పైనుంచి చిన్నారి వేలాడుతూ కనిపించిన వెంటనే క్షణం ఆలోచించకుండా భవంతి ఎక్కేశానని చెబుతున్నాడు. తనకు చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టమని, వారు బాధపడుతుంటే తాను చూడలేనని గస్సమా చెబుతున్నాడు.