ఇతనో రియల్‌ 'స్పైడర్‌మ్యాన్‌'..

ఇతనో రియల్‌ 'స్పైడర్‌మ్యాన్‌'..

హాలీవుడ్ మూవీస్‌లో స్పైడర్ మ్యాన్ గురించి తెలుసుకదా? ఓ బిల్డింగ్‌ నుంచి మరో బిల్డింగ్‌పైకి అలవోకగా దూకేస్తాడు. సరిగ్గా ఇటువంటి విన్యాసాలనే చేసి ఓ చిన్నారి ప్రాణాలను కాపాడాడో 'రియల్‌ స్పైడర్‌ మ్యాన్‌'. ఇంతకీ విషయమేంటంటే..  పారిస్‌లోని ఓ భవంతిలోని నాలుగో అంతస్తు నుంచి నాలుగేళ్ల చిన్నారి ప్రమాదకరంగా వేలాడతుండడాన్ని మమౌడు గస్సామా అనే  22 ఏళ్ల యువకుడు చూశాడు. నిమిషం ఆలస్యం చేయకుండా  స్పైడర్‌మ్యాన్‌లా ఒక అంతస్తు నుంచి ఇంకో అంతస్తుకు చేతులతో ఎక్కుతూ చిన్నారి ఉన్న అంతస్తుకు క్షణాల్లో చేరుకున్నాడు. గబగబా పైకెక్కి ఆ బాబును అమాంతం లాగేసి ప్రాణాలు కాపాడాడు. మమౌడు సాహసంపై పారిస్‌ మేయర్‌ ప్రశంసలు గుప్పించగా, సోషల్‌ మీడియాలో అతన్ని హీరోగా, స్పైడర్‌ మ్యాన్‌గా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడీ రియల్ స్పైడర్‌మ్యాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.