'హోదా' కాంగ్రెస్‌తోనే సాధ్యం: చాందీ

'హోదా' కాంగ్రెస్‌తోనే సాధ్యం: చాందీ

ప్రాంతీయ పార్టీలతో ప్రత్యేక హోదా సాధ్యం కాదని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ ఇన్‌చార్జి ఉమెన్‌ చాందీ అన్నారు. ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఆయన పార్టీ కోఆర్డినేషన్‌ కమిటీ నాయకులతో ఇవాళ  విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ పార్టీలతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో గుంటూరు సభలో రాహుల్‌ గాంధీ చెప్పారని చాందీ గుర్తుచేశారు. ఆర్థిక కారణాల వల్లే చంద్రబాబు ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి రాలేదని చాంది చెప్పారు. హోదా కోసం టీడీపీ, వైసీపీ ఆశించిన మేర కృషి చేయలేకపోయాయని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పునర్‌వైభవం తెస్తానని చాందీ చెప్పారు. పార్టీని వదిలి వెళ్లిన నేతలంతా మళ్లీ చేరాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 13 జిల్లాల పార్టీ అధ్యక్షులు, వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.