క్రిష్ 4 లో విలన్ ఎవరంటే ...?

క్రిష్ 4 లో విలన్ ఎవరంటే ...?

సూపర్ హీరోల కథలకు మంచి ఆధరణ లభిస్తుంది. ఈ సినిమాలను ఒక సిరీస్లగా కొనసాగిస్తుంటారు. ఇవి చిన్నారులని బాగా ఆకట్టుకుంటాయి.  అయితే హాలీవుడ్ లో అధికంగా ఈ తరహా సినిమాలు తెరకెక్కుతాయి. అయితే అదే విధంగా మన దగ్గర వచ్చిన సూపర్ హీరో సినిమా క్రిష్. ఈ సినిమాలో సూపర్ హీరో గా బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా కు సంబంధించి మూడు భాగాలు వచ్చి మంచి విజయం సాధించాయి. అయితే ఇప్పుడు అభిమానులు అందరూ క్రిష్ 4 గురించి వేచిఉన్నారు. అయితే తాజాగా హృతిక్ రోషన్ తండ్రి క్రిష్ సిరీస్ దర్శకుడు "రాకేశ్ రోషన్" ఈ సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని మొదటి మూడు సినిమాల కంటే మరింత అడ్వాన్స్ గా ఈ సినిమా తీసే పనిలో ఉన్నామని కథ కూడా దానికి తగ్గట్లే సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే త్వరలో ఈ సినిమా పట్టాలు ఎక్కుతుంది అని తెలియజేశాడు రాకేశ్ రోషన్. అయితే ఈ సినిమాలో విలన్ గా ఒక సౌత్ హీరోను తీసుకోనున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంత భారీ సినిమాలో అవకాశం దక్కించుకునే ఆ హీరో ఎవరు అనే విషయం మాత్రం ఇంకా తెలియదు. చూడాలి మరి ఆ అవకాశం ఎవరిని వరిస్తుంది అనేది.