జూన్‌ 1 నుంచి ఈ రూట్లలో రైళ్లు-దక్షిణ మధ్య రైల్వే

జూన్‌ 1 నుంచి ఈ రూట్లలో రైళ్లు-దక్షిణ మధ్య రైల్వే

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ నుంచి క్రమంగా కొన్ని సడలింపులు ఇస్తూ వస్తోంది కేంద్రం ప్రభుత్వం.. దీనిలో భాగంగా జూన్ 1వ తేదీ నుంచి ప్రజా రవాణాను దశలవారీగా అందుబాటులోకి తేవాలనే నిర్ణయానికి వచ్చింది. 1వ తేదీ నుంచి రోజుకు 200 ఏసీ, నాన్‌ ఏసీ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించగా. జనరల్ బోగీల్లో ప్రయాణించాలన్నా టికెట్‌ను ఐఆర్‌సీటీసీలో బుక్ చేసుకోవాలని స్పష్టం చేసింది.. ఇక, జూన్ 1 నుంచే రైళ్ల రాకపోకలు ప్రారంభించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలుగు రాష్ట్రాల్లో రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేశారు అధికారులు. జూన్ 1 నుంచి 13 రైల్ సర్వీసులను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.. జూన్ 1 న జంట నగరల నుంచి ముంబై, ఢిల్లీ, హౌరా, ధన్‌పూర్‌, గుంటూరు, విశాఖపట్నం మధ్య రైల్వే సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. తిరుపతి -నిజామాబాద్, నాందేడ్-అమృత్సర్ మధ్య సర్వీసులు నడుపుతామని.. జూన్‌ 2, 3వ తేదీల్లో గమ్యస్థానం నుంచి జంట నగరాలకు సర్వీసులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఇక, దక్షిణ మధ్య రైల్వే నడపనున్న రైళ్లకు సంబంధించిన టైంటేబుల్‌ను కింద గమనించవచ్చు.