ఆ పనిలో గంగూలీ బెస్ట్ అని మళ్ళీ నిరూపించాడు...

ఆ పనిలో గంగూలీ బెస్ట్ అని మళ్ళీ నిరూపించాడు...

అంఫన్ తుఫాను యొక్క భారాన్ని భరించాల్సిన చాలా మందిలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఒకరు, కానీ అతని ఇంట్లో జరిగిన నష్టం ఏంటంటే మామిడి చెట్టును విరిగి పడ్డటం. కోల్‌కతాలోని బెహాలా ప్రాంతంలో ఒక బంగ్లాలో నివసిస్తున్న గంగూలీ, తుఫాను కారణంగా పడిపోయిన తన ఇంటి వద్ద పాత ఉన్న చెట్టుకు తాళ్లు కట్టి మళ్ళీ దానిని నిలబెట్టాడు దాదా. భారత మాజీ కెప్టెన్ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేశాడు, తుఫాను దెబ్బతిన్న చెట్టు వివరాలను వెల్లడించాడు. "ఇంట్లో ఉన్న మామిడి చెట్టును ఎత్తి, వెనక్కి లాగి మళ్ళీ నిలబెట్టాము" అని గంగూలీ తెలిపాడు. అయితే దాదా కు పడిపోయినవి నిలబెటట్టం అలవాటే. ఎందుకంటే దాదా 2000 సంవత్సరం లో భారత  జట్టుకు న్యాయకత్వపు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పడిపోతున్న జట్టును ఎవరికి  అందనంత ఎత్తులో నిలబెట్టాడు. అయితే ఇప్పుడు ఈ చెట్టును నిలబెట్టి ఆ పనిలో గంగూలీ బెస్ట్ అని మళ్ళీ నిరూపించాడు.