నాకు ఆ ముగ్గురు కావాలి... ఆవకాశమస్తే...

నాకు ఆ ముగ్గురు కావాలి... ఆవకాశమస్తే...

మాజీ భారత కెప్టెన్ మరియు ప్రస్తుత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా [బీసీసీఐ] అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత జట్టుకు మరపురాని విజయాలను అందించాడు, వాటిలో ముఖ్యమైనది 2003 లో ప్రపంచ కప్ ఫైనల్ లోకి భారతదేశం ప్రవేశించడం. నెదర్లాండ్స్‌తో జరిగిన సెమిస్ లో ఘన విజయం సాధించిన తరువాత, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా చేతిలో మెన్ ఇన్ బ్లూ తొమ్మిది వికెట్ల తేడాతో ఫైనల్ లో పరాజయాన్ని చవిచూసింది. అయితే అదేవిధంగా గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ లో కివీస్ చేతిలో భారత జట్టు సెమిస్ లో ఓడిపోయింది. అయితే  సౌరవ్ గంగూలీని సోషల్ మీడియాలో ఓ అభిమాని... తన 2003 జట్టులోకి  2019 ప్రపంచ కప్ జట్టు నుండి ముగ్గురు ఆటగాళ్లను తీసుకోవాలని కోరాడు. దానికి సమాధానంగా గంగూలీ... నాకు అవకాశం ఇస్తే, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ అలాగే పేసర్ జస్ప్రీత్ బుమ్రాని తీసుకుంటాను అని తెలిపాడు. అలాగే ఒకవేళ మీరు నాకు నాలుగో అవకాశం ఇచినట్లైతే నేను ఎంఎస్ ధోని కూడా తీసుకుంటానని చెప్పాడు.