దాదాను కూడా క్వారెంటైన్ లో కూర్చోబెట్టిన కరోనా...

దాదాను కూడా క్వారెంటైన్ లో కూర్చోబెట్టిన కరోనా...

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. గంగూలీ అన్నయ్య అయిన బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి స్నేహాశిష్‌ గంగూలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే అంతకముందు స్నేహాశిష్‌ భార్య అలాగే ఆయన‌ అత్తమామలు కరోనా బారిన పడ్డారు. తాజాగా తన అన్నయ్య కు కరోనా పాజిటివ్ రావడంతో దాదా హోమ్  క్వారెంటైన్ లోకి వెళ్ళాడు. ఇక దాదాకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే ఈ రోజు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందులో భారతదేశ ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా ఐపీఎల్, ఇంగ్లాండ్ సిరీస్ పై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుది.