ఐసీసీ అంత సులువుగా ప్రపంచ కప్ వదలదు : గంగూలీ 

ఐసీసీ అంత సులువుగా ప్రపంచ కప్ వదలదు : గంగూలీ 

ఈ ఏడాది ప్రపంచ కప్ భవిష్యత్తుపై ఐసీసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, దాని కోసం బీసీసీఐ వేచి ఉందని సౌరవ్ గంగూలీ అన్నారు. టీ 20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఐసీసీ తమ వంతు ప్రయత్నం చేస్తోందని దానిని అంత సులువుగా వదిలేయదని గంగూలీ తెలిపారు. మన బీసీసీఐకి ఐపీఎల్ ఎంత ముఖ్యమో ఐసీసీకి టీ 20 ప్రపంచ కప్ కూడా అంతే ముఖ్యం అని గంగూలీ అన్నారు. "మేము ఐసీసీ తో చర్చలు జరిపాము, ఇంకా ఎటువంటి నిర్ణయం లేదు. ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఐసీసీ చివరి వరకు ప్రయత్నిస్తోందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది వారికి భారీ ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది. అందుకే మనం వారి నిర్ణయం కోసం మేము వేచి ఉండాల్సి ఉంటుంది "అని సౌరవ్ గంగూలీ అన్నారు. ప్రపంచ కప్ వాయిదా పడితే అక్టోబర్-నవంబర్ విండోలో ఐపీఎల్ కు ఆతిథ్యమివ్వాలని బీసీసీఐ చూస్తుందనే విషయం తెలిసిందే.