ఆసియన్ చెస్ టోర్నీ: తలకు చున్నీ లేదని...

ఆసియన్ చెస్ టోర్నీ: తలకు చున్నీ లేదని...

ఆసియన్ టీమ్ చెస్ చాంపియన్ షిప్ లో ఉమెన్ గ్రాండ్ మాస్టర్ సౌమ్యా స్వామినాథన్ కు ఘోర అవమానం ఎదురైంది. తలకు చున్నీ లేదని ఆమెను ఆసియన్ చెస్ టోర్నీ నుంచి పంపించేశారు నిర్వాహుకులు. ఇరాన్ లో జరిగే ఆసియన్ టీమ్ చెస్ చాంపియన్ షిప్ లో పాల్గొనే మహిళలంతా హెడ్ స్కార్ఫ్(తలకు చున్నీ) ధరించాలని ఇరాన్ నిబంధన విధించింది. అయితే 'తలకు చున్నీ కప్పుకోవడం లేదా బుర్ఖా ధరించడం నాకు ఇష్టం లేదు. ఇరాన్ చట్టంలోని ఈ నిబంధన మానవ హక్కులను, వ్యక్తిగత స్వేచ్ఛను  దెబ్బతీసేలా ఉందని' సౌమ్య తెలిపింది. స్కార్ఫ్ ధరించకుంటే టోర్నీలో అనుమతించబోమని ఆసియన్ టీమ్ చెస్ చాంపియన్ షిప్ నిర్వాహుకులు స్పష్టం చేశారు. దీంతో  టోర్నీ నుండి ఉమెన్ గ్రాండ్ మాస్టర్ సౌమ్య వైదొలగింది. ఇంతకుముందు 2016లో ఇండియన్ షూటర్ హీనా సింధూ కూడా ఇదే కారణంతో షూటింగ్ పోటీల నుంచి వైదొలగింది.