ఆ రెండు బాలీవుడ్ సినిమాలు వచ్చేది అప్పుడే

ఆ రెండు బాలీవుడ్ సినిమాలు వచ్చేది అప్పుడే

ఎప్పుడు ప్రేక్ష‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడే థియేటర్స్ ఇప్పుడు క‌రోనా వ‌ల‌న పూర్తిగా స్తంభించాయి. దాదాపు మూడు  నెల‌లుగా షూటింగ్స్ కూడా లేక‌పోవ‌డంతో థియేట‌ర్‌లో బొమ్మ ప‌డ‌డం ఆగిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా వేసవిలో విడుదల కావాల్సిన చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. కొన్ని సినిమాలు ఓటీటీ వేదికలుగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నాయి.ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీ  లో డైరెక్ట్ గా విడుదల అయ్యాయి .అయితే విడుదల కావాల్సిన సినిమాలో అక్షయ్ కుమార్ నటించిన సూర్య వంశీ , రణ్ వీర్ సింగ్ నటించిన 86 కూడా ఉన్నాయి. సమ్మర్ కు  రావాల్సిన ఈ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి . ఈ మధ్య ఈ రెండు సినిమాలు ఓటీటీ లో విడుదల అవుతున్నాయని ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలను చిత్ర బృందాలు ఖండించాయి. ఇప్పుడు ఈ రెండు చిత్రాల విడుదలపై స్పష్టత వచ్చింది.అక్షయ్‌కుమార్‌, కత్రినాకైఫ్‌, అజయ్‌దేవ్‌గణ్‌, రణవీర్‌ సింగ్‌ కీలక పాత్రల్లో నటించిన  'సూర్యవంశీ' సినిమాకు రోహిత్‌శెట్టి దర్శకుడు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు పీవీఆర్‌ సినిమాస్‌ పేర్కొంది.కపిల్‌దేవ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం '83'. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ నటించారు. కపిల్‌దేవ్‌ సతీమణి రోమీ భాటియాగా దీపికా పదుకొణె కనిపించనున్నారు. ఈ చిత్రం ఏకంగా క్రిస్మస్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పీవీఆర్‌ సినిమాస్‌ ప్రకటించింది.