సోని చేతికి ఈఎంఐ మ్యూజిక్‌

సోని చేతికి ఈఎంఐ మ్యూజిక్‌

అత్యంత ప్రజాదరణ కల్గిన మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ ఉన్న ఈఎంఐ మ్యూజిక్‌ పబ్లిషింగ్‌ కంపెనీ సోని చేతికి వచ్చేసింది. ఈఎంఐలో 60 శాతం వాటా కొనుగోలు చేయాలని సోని నిర్ణయించింది. ఈ డీల్‌ తరవాత ఈఎంఐలో సోనీ వాటా 90 శాతానికి చేరుతుంది. ఈ డీల్‌ విలువ 290 కోట్ల డాలర్లుగా మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ద బీటిల్స్‌, పింక్‌ ఫ్లాయిడ్‌, క్వీన్‌, ద అర్కిటిక్‌ మంకీస్‌, టినా టర్నర్‌తో పాటు వేల ఆల్బమ్స్‌ ఈఎంఐ కంపెనీ చేతిలో ఉన్నాయి. ఇటీవల సోని కొత్తగా సీఈఓ కెనికిరో యోషిదా తీసుకున్న తొలి పెద్ద నిర్ణయం ఇదే.  స్పోటిఫై వంటి మ్యూజింగ్‌ స్ర్టీమింగ్‌ సర్వీసులకు మున్ముందు మంచి భవిష్యత్తు ఉందని సోని నమ్ముతోంది. మ్యూజిక్‌ హక్కులు ఉన్న కంపెనీని కొనుగోలు చేయడంతో ఈ కంపెనీ ఆల్బమ్స్‌ వాడే యాపిల్‌, స్పోటిఫై వంటి కంపెనీలు ఇక నుంచి సోనీకి రాయల్టీలు చెల్లించాల్సి ఉంటుంది.