కరీంనగర్ లో కరోనా భయంతో కన్నతల్లినే ఇంటినుంచి బయటకు...!

కరీంనగర్ లో కరోనా భయంతో కన్నతల్లినే ఇంటినుంచి బయటకు...!

కరీంనగర్ కిసాన్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి పేరుతో తల్లిని వదిలించుకోవాలని చూశారు కుమారులు. మహరాష్ట్ర షోలాపూర్ నుంచి కొడుకుల ఇంటికి తల్లి శ్యామల చేరుకుంది. అయితే తల్లికి కరోనా సోకిందని కొడుకులు ఇంట్లోకి రానివ్వలేదు. కొడుకులు ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఎర్రటి ఎండలో రోడ్డుపైనే కూలబడింది. చివరికి ఆ నోట ఈ నొట పడి విషయం స్థానిక కార్పోరేటర్ అశోక్ కి చేరడంతో ఆయన అక్కడికి చేరుకున్నాడు. చివరికి ఆయన జోక్యంతో పెద్ద కుమారుడి ఇంటికి చేరుకుంది. అల్లారు ముద్దుగా పెంచిన ఇద్దరు కొడుకులు కాదని ఆ తల్లిని నడిరోడ్డు పై వదిలేయ్యడం స్థానికగా చర్చనీయంశంగా మారింది.