పిక్‌టాక్‌: అందాల పెళ్లి కూతురు

పిక్‌టాక్‌: అందాల పెళ్లి కూతురు

దివినుంచి దిగివ‌చ్చిన దేవ‌తా సుంద‌రిని త‌ల‌పిస్తోంది ఈ న‌వ‌వ‌ధువు. కొత్త పెళ్లి కూతురు ధ‌రించిన ఈ డ్రెస్ పేరేమి? అంటే అది చాలా ఇంట్రెస్టింగ్. దీని పేరు అనూరాధా వాకిల్ రెడ్ లెహంగా. కాంబినేష‌న్ మ్యాచింగ్ రెడ్ క‌ల‌ర్ బ్లౌజ్‌తో .. వ‌జ్ర‌వైఢూర్య ఆభ‌ర‌ణాల‌తో సోన‌మ్ మైమ‌రిపిస్తోంది. 

క‌పూర్ గాళ్ సోన‌మ్‌... తాను వ‌ల‌చిన స‌ఖుడు ఆనంద్ అహూజాతో పెళ్లి వేడుక ముంబైలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో ముంబై టాప్ సెల‌బ్రిటీలు సంద‌డి చేశారు. ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు, పారిశ్రామిక వేత్త‌ల‌తో పాటు, బాలీవుడ్ నుంచి దిగ్గ‌జాలు ఈ పెళ్లి వేడుక‌కు హాజ‌ర‌వ్వ‌డంతో బాంద్రాలోని సోన‌మ్ ఆంటీ బంగ్లా వేడెక్కిపోయింది. ఓ ర‌కంగా ఈ వివాహ మ‌హోత్స‌వ వేదిక‌ ఇంద్ర‌లోకాన్నే త‌ల‌పించింది. పెళ్లికి ముందే మెహందీ కార్య‌క్ర‌మంలో సోన‌మ్ ఇలా ద‌ర్శ‌న‌మిచ్చింది. ట్రెడిష‌న‌ల్ పంజాబీ కుడీ స్టైల్లో!