వీర్రాజు ఫోన్ మూగబోయింది!

వీర్రాజు ఫోన్ మూగబోయింది!

ఆంధ్రప్రదేశ్‌, భారతీయ జనతా పార్టీలో ముసలం మొదలైనట్టేనా? రాష్ట్ర బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకంతో పార్టీలో లుకలుకలు మొదలయ్యాయా? అంటే... అవుననే తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించడంపై రాష్ట్ర బీజేపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్ర పార్టీ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు సోము వీర్రాజు. పార్టీ మారడానికి సిద్ధపడిన వ్యక్తికి పదవి కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన సెల్‌ఫోన్‌ను స్విచాఫ్ చేసుకుని పార్టీ నేతలను అందుబాటులోకి రావడం లేదు వీర్రాజు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా... టూర్‌కు దూరంగానే ఉన్నారు సోము. 

అటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర అధ్యక్ష పదవులకు రాజీనామా చేస్తున్నట్టు నేతలు ప్రకటన చేశారు. చివరి నిమిషం వరకు సోము వీర్రాజు... అధ్యక్ష పదవి రేసులో ఉన్నా కన్నాను ఆ పదవి వరించింది. ఇప్పటి వరకు సోము వీర్రాజు బహిరంగగా ఈ విషయంపై మాట్లాడకపోయినా... దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. సోము వీర్రాజుతో పాటు మరికొందరు నేతలు కూడా కన్నా నియామకంపై సంతృప్తిగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి.