ఒక్కరోజే ఇంట్లో ఉండలేకపోయాం...భర్తల ఆవేదన...!!

ఒక్కరోజే ఇంట్లో ఉండలేకపోయాం...భర్తల ఆవేదన...!!

కరోనా ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్నది.  నిన్నటి రోజున జనతా కర్ఫ్యూ విధించారు.  జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలు ఎవరూ కూడా బయటకు రాలేదు. ఇంట్లో నుంచి 14 గంటల పాటు బయటకు రాకుండా ఉండటంతో కరోనా వైరస్ చైన్ బ్రేక్ చేసేందుకు కొంత వరకు అవకాశం ఏర్పడింది.  కదలకుండా ఇంట్లో కూర్చోవడం అంటే చాలామందికి ఇబ్బందే కానీ, అత్యవసర సమయం కాబట్టి కూర్చోక తప్పదు.  

కొంతమందికి ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే తెగ ఇబ్బంది పడిపోయారట.  వారి బాధను సోషల్ మీడియాలో వెళ్లబోసుకున్నారు.  14 గంటల పాటు భార్య ముందు కూర్చోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీకు తెలియదా అంటూ కొందరు ప్రశ్నించారు.  కొంతమంది తమ బాధను వీడియో రూపంలో వెళ్లబోసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.