స్పెషల్ స్టోరీ: మహాత్ముని గురించిన కొన్ని సత్యాలు.. 

స్పెషల్ స్టోరీ: మహాత్ముని గురించిన కొన్ని సత్యాలు.. 

అక్టోబర్ 2 1869లో గుజరాత్ లోని పోరుబందర్లోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన గాంధీ 20 వ శతాబ్దంలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా గుర్తింపబడ్డారు.  అహింసను ఆయుధంగా చేసుకొని బ్రిటిష్ దొరలపై తిరుగుబాటు చేసిన మహానాయుడు, యోధుడు మహాత్మాగాంధీ.  

అహింసావాది అయిన గాంధీజీ తన 13 ఏటానే కస్తూర్బాను వివాహం చేసుకున్నారు.  ఆమె గాంధీ కంటే ఒక ఏడాది పెద్దది కావడం విశేషం.  గాంధీజీ యుద్ధం అంటే గిట్టదు.  కొట్లాటలకు దూరంగా ఉంటారు. అయితే, గాంధీని మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటిష్ తరపున పోరాటం చేయడం కోసం భారతీయులు ఆయన్ను ఎంపికచేశారు.  రెండో ప్రపంచ యుద్ధసమయంలో అయన యుద్ధంలో పాల్గొనేందుకు ఆయన వ్యతిరేకించారు. 

గాంధీ భార్య కస్తూర్భా గాంధీ 1944లో ఆగా ఖాన్ ప్యాలెస్ లో ఉండగా మరణించారు.  ఆమె మరణించిన సమయంలో గాంధీ జైళ్లో ఉన్నారు.  చదువుకునే పిల్లలు చేతిరాతకు అందంగా రాయడం నేర్చుకోవాలని గాంధీగారు పదేపదే చెప్తుండేవారు.  దానికి కారణం లేకపోలేదు.  గాంధీ లండన్ లో న్యాయ విద్యను అభ్యసించే సమయంలో అక్కడి వారు గాంధీ చేతిరాత బాగాలేదని విమర్శించేవారట.  

జనవరి 30, 1948న గాంధీ హత్యకు గురయ్యారు. గాడ్సే ఆయనపై మూడుసార్లు కాల్పులు జరిపాడు. మహాత్ముడికి కడసారి వీడ్కోలు పలకడానికి 20 లక్షల మందికిపైగా వచ్చారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం వచ్చిన వారు 8 కి.మీ. మేర బారులు తీరారు.  ఇకపోతే, నోబెల్ శాంతి పురస్కారానికి గాంధీ ఐదుసార్లు నామినేట్ అయ్యారు.  కానీ, ఒక్కసారి కూడా ఆయనకు నోబెల్ పురస్కారం రాలేదు.  దీంతో ఇండియానే గాంధీ శాంతి బహుమతిని ఏర్పాటు చేసింది.