ఇంత జరుగుతున్నా... వాళ్లకు చీమ కుట్టినట్టైనా లేదా ?

ఇంత జరుగుతున్నా... వాళ్లకు చీమ కుట్టినట్టైనా లేదా ?

యూరప్ దేశాలలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది.  ఇటలీ, స్పెయిన్ తరువాత ఇంగ్లాండ్ ను ఈ వైరస్ భారీగా విస్తరించింది.  అక్కడి టాప్ రాజకీయ నాయకులను కూడా ఈ వైరస్ వదలడం లేదు.  బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ కరోనా బారిన పడ్డారు.  ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  అలానే బ్రిటన్ ప్రధాని సైతం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.  మొన్నటి వరకు హోమ్ క్వారెంటైన్ లో ఉన్న ప్రధానిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.  

అయితే, కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు.  అయితే, బ్రిటన్ వాసులు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి పార్క్ ల్లో గుంపులు గుంపులు తిరుగుతున్నారు.  ఒకవైపు కరోనాతో దేశం మొత్తం అట్టుడికిపోతున్నా, ప్రజల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.  ప్రాణాలు పోయినా పర్వాలేదు... ఎంజాయ్ చేస్తూనే మరణిస్తాం అనే విధంగా ప్రవర్తిస్తున్నారు.  పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.  దీంతో పోలీసులు సైతం కొంత కఠినంగా ప్రవర్తించి పార్క్ ల నుంచి ప్రజలను ఇళ్లకు పంపించేస్తున్నారు.  మొండికేసిన వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు.  దేశంలో కరోనా విజృంభిస్తున్నా, చీమకుట్టినట్టయినా లేకుండా పోయింది వీళ్లకు.  ప్రజలు పరిస్థితిని అర్ధం చేసుకొని సహకరించాలని బ్రిటన్ ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తున్నది.