పొరుగు భాష‌ల్లో `సింగం` హ‌వా

పొరుగు భాష‌ల్లో `సింగం` హ‌వా

సూర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన `సింగం` సిరీస్ సౌత్‌లో ఎంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌రో తెలిసిందే. సింగం తెలుగులో `య‌ముడు` పేరుతో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. సూర్య కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. గ‌జిని త‌ర‌వాత తెలుగులో త‌న‌కు అంత పెద్ద బూస్ట్ ఇచ్చిన సిరీస్ ఇది. ఇందులో రెండు, మూడు భాగాలు రిలీజ‌య్యాయి. మూడో భాగం ఫ‌లితం రివ‌ర్స‌యినా సూర్య‌కు పేరొచ్చింది. అదంతా అటుంచితే, ఇదే `సింగం` హిందీలో రీమేకై సంచ‌ల‌న విజ‌యం సాధించింది అప్ప‌ట్లో. అజ‌య్‌దేవ‌గ‌న్ క‌థానాయ‌కుడిగా రోహిత్ శెట్టి తెర‌కెక్కించిన ఈ చిత్రం 55 కోట్ల‌తో తెర‌కెక్కి 150 కోట్లు వ‌సూలు చేసింది. హిందీలో కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టించ‌గా, ఒరిజిన‌ల్ విల‌న్ ప్ర‌కాష్‌రాజ్ య‌థాత‌థంగా త‌న పాత్ర‌ను అక్క‌డా పోషించాడు. ఇప్పుడు ఈ సినిమాని పంజాబీలో రీమేక్ చేస్తున్నారు. ఆ మేర‌కు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్విట్ట‌ర్ ద్వారా అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు.