16,700 కి.మీ. నాన్‌ స్టాప్‌ ప్రయాణం

16,700 కి.మీ. నాన్‌ స్టాప్‌ ప్రయాణం

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ పౌర విమానయాన రంగంలో కొత్త  రికార్డు సృష్టించనుంది. సింగపూర్‌ నుంచి అమెరికాలోని నెవార్క్‌ (న్యూజెర్సీ రాష్ట్రం)కు నాన్‌ స్టాప్‌ విమానాన్ని నడపబోతోంది. సింగపూర్‌ నుంచి నెవార్క్‌ మధ్య ఉన్న 16,700 కి.మీ. దూరాన్ని 18 గంటల 45 నిమిషాల్లో ఈ విమానం చేరుకుంటుంది.  ప్రారంభంలో వారానికి మూడుసార్లు ఈ సర్వీసును నిర్వహించనున్నట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. వచ్చే అక్టోబర్‌ 18 నుంచి రోజూ నడుపుతారు. ఏ 350 900 యూఎల్‌ఆర్‌ ఎయిర్‌బస్‌లో రెండు క్లాస్‌ టికెట్లు ఉంటాయి. 67 బిజినెస్‌ క్లాస్‌ సీట్లు, 94 ప్రీమియర్‌ ఎకానమీ సీట్లు ఉంటాయి.