రజినికాంత్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న టాప్ హీరోయిన్

రజినికాంత్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న టాప్ హీరోయిన్

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ స‌ర‌స‌న `స‌మ‌ర‌సింహారెడ్డి`, `న‌ర‌సింహా నాయుడు` చిత్రాల్లో న‌టించింది సిమ్ర‌న్‌. బాల‌య్య‌కు ధీటుగా పోటీప‌డుతూ న‌టించ‌డ‌మే కాకుండా, డ్యాన్సుల‌తోనూ అద‌ర‌గొట్టేసింది ఈ సీనియ‌ర్ న‌టి. సౌత్ ఇండ‌స్ట్రీలో ఉన్న అరుదైన డ్యాన్స‌ర్ కం న‌టిగా సిమ్ర‌న్‌కి ఉన్న ఐడెంటిటీ గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. అయితే గ‌త కొంత‌కాలంగా సిమ్ర‌న్ సినిమాల‌కు దూరంగా ఉన్నారు. పెళ్లి త‌ర‌వాత మేక‌ప్ వేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌లి కాలంలో సిమ్ర‌న్ రీఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించ‌నున్న‌ 162వ సినిమా .. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో ర‌జ‌నీ స‌ర‌స‌న సిమ్ర‌న్ న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే సిమ్ర‌న్‌కి గ్రాండ్ రీఎంట్రీ దొరికిన‌ట్టే.  పెళ్లి త‌ర‌వాత కొత్త ఇన్నింగ్స్‌కి ఇది క‌లిసి వ‌స్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.