ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఆమెదే...

ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఆమెదే...

ఫ్రెంచ్ ఓపెన్ మ‌హిళ‌ల సింగిల్స్‌ టైటిల్ కైవసం చేసుకుంది సిమోనా హెలెప్... ఈ రోజు ఫ్రెంచ్ ఓపెన్ మ‌హిళ‌ల సింగిల్స్‌లో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో స్లోన్ స్టీఫెన్స్‌పై 3-6, 6-4 ,6-1 తేడాతో సిమోనా హెలెప్ విక్టరీ కొట్టింది. రెండు గంటల మూడు నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది సిమోనా... కాగా, ఇప్పటి వరకు మూడు మేజర్ ఈవెంట్లలో ఫైనల్ మ్యాచ్‌లో సిమోనా ఓటమి పాలైంది. ఆమె కెరీర్‌లో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. దీంతో ఆమె ఆప్యాయంగా ఆ టైటిల్‌ను ముద్దాడుతూ... ఆనంద బాష్పాలు కార్చింది.