కోహ్లీ స్థానంలో శ్రేయస్...

కోహ్లీ స్థానంలో శ్రేయస్...

అఫ్గానిస్థాన్‌తో జరిగే టెస్టు మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ స్థానంలో యువ సంచలనం శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కౌంటీల్లో ఆడేందుకు కోహ్లి జూన్‌లో ఇంగ్లాండ్‌ వెళ్లనున్నాడు. దీంతో విరాట్ అఫ్గాన్‌ టెస్టు, ఐర్లాండ్‌ సిరీస్‌కు అందుబాటులో ఉండడు. జులై మొదటి వారంలో కోహ్లీ తిరిగి భారత జట్టుతో కలుస్తాడు.

ఈ క్రమంలో అఫ్గానిస్థాన్‌ టెస్టు మ్యాచ్ కు.. విరాట్ స్థానంలో శ్రేయస్‌ పేరును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌ ఆడుతున్న పుజారా, ఇషాంత్‌ శర్మ అఫ్గాన్‌ టెస్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ తెలిపింది. కోహ్లీ స్థానంలో శ్రేయస్‌.. జడేజా స్థానంలో అక్షర్‌.. హార్డిక్‌ పాండ్య స్థానంలో విజయ్‌ శంకర్‌ పేర్లు సెలక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే ఈ టెస్టుకు రహానె సారథ్యం వహించనున్నాడు. ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌కు రోహిత్‌ శర్మ నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి.