పెళ్లి తరువాత శ్రీయ ... ఇంతలా మారిపోయిందా...

పెళ్లి తరువాత శ్రీయ ... ఇంతలా మారిపోయిందా...

ఇష్టం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీయ సంతోషం సినిమాతో మంచి పేరుతెచ్చుకుంది.  టాలీవుడ్ టాప్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో కలిసి నటించిన శ్రీయ దశాబ్దకాలం పాటు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణించింది.  2001లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీయ 2018 లో రష్యన్ ఫోటోగ్రాఫర్ ను వివాహం చేసుకుంది.  

భర్త స్వతహాగా ఫోటోగ్రాఫర్ కావడంతో శ్రీయ తన గ్లామర్ పై మరింత దృష్టి పెట్టింది.  పెళ్లి తరువాత శ్రీయ సినిమాల్లో నటించడం తగ్గించినా, సోషల్ మీడియా ద్వారా నిత్యం తన అభిమానులకు దగ్గరవుతూనే ఉన్నది.  బీచ్ లో స్విమ్మింగ్ డ్రెస్ తో ఉన్న కొన్ని ఫోటోలను శ్రీయ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఈ ఫొటోల్లో శ్రీయ చాలా అందంగా కనిపించింది.  భర్త డైరెక్షన్లో తన అందానికి మెరుగులు దిద్దుకుంటున్నట్టు చెప్తోంది ఈ మనం బ్యూటీ.